అప్పుడు శ్రుతి ఎందుకు మాట్లాడలేదు?

23 Oct, 2018 01:58 IST|Sakshi
ఐశ్వర్య

‘‘నిబుణన్‌’ షూటింగ్‌లో నాతో అర్జున్‌ అసభ్యకరంగా వ్యవహరించారు. సినిమాను ఆపడం ఇష్టం లేకే ఈ విషయాన్ని అప్పుడు కాకుండా ఇప్పుడు చెబుతున్నా’’ అని నటి శ్రుతీ హరిహరన్‌ పేర్కొనడం సంచలనం రేపింది. నటుడు ప్రకాశ్‌రాజ్‌తో పాటు మరికొందరు శ్రుతీకి మద్దతుగా నిలిస్తే, ‘నిబుణన్‌’ చిత్రదర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌తో పాటు ఇంకొందరు అర్జున్‌ని  సపోర్ట్‌ చేస్తున్నారు. తాజాగా అర్జున్‌ తనయ, నటి ఐశ్వర్య స్పందిస్తూ – ‘‘మీటూ’ ఉద్యమాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారు.

తన సినిమా కథలను వినమని నాన్న నాకు చెబుతుంటారు. ‘నిబుణన్‌’ కథలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాల్ని తొలగిస్తే కానీ చేయనని మా నాన్న చెప్పినప్పుడు శ్రుతి ఎందుకు మాట్లాడలేదు? ఆ సినిమాకి ఆమె పనిచేసింది 5 రోజులే. ఆ 5 రోజుల్లో నాన్న వల్ల ఇబ్బంది కలిగిందని వెల్లడించారు. రిసార్ట్‌కి, డిన్నర్‌కి పిలిచేంత టైమ్‌ నాన్నకు లేదు. అస్సలు మా నాన్న పబ్‌కు వెళ్లడం నేనెప్పుడూ చూడలేదు. అలాంటిది ఆమెను రిసార్ట్‌కు రమ్మంటారా? శ్రుతి  సొంత లాభం కోసమే ఇలా చేస్తున్నారు’’ అన్నారు ఐశ్వర్య.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా