నలుగురి నేరగాళ్ల కథ

22 Feb, 2018 00:11 IST|Sakshi
ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా

‘‘రెగ్యులర్‌ సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్‌ వైపు చూడటం లేదు. తెలుగు ప్రేక్షకుల్లో చాలా మార్పొచ్చింది. కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ‘ఐతే 2.0’ మంచి సినిమా అవుతుంది’’  అని డైరెక్టర్‌ నందినీరెడ్డి అన్నారు. ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్, కర్తవ్య శర్మ, నీరజ్, మృణాల్, మృదాంజలి ముఖ్య తారలుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐతే 2.0’. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామరాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మించిన ఈ సినిమా మోషన్‌ పోస్టర్, టీజర్‌ను నిర్మాత రాజ్‌ కందుకూరి, నందినీరెడ్డి విడుదల చేశారు.

రాజ్‌ మాదిరాజు మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్‌ పూర్తి చేసి నిరుద్యోగంతో ఉన్న నలుగురు యువకులు ఆకలి, ఆశకి లొంగక ఆక్రోశానికి బలై క్రిమినల్స్‌గా ఎలా మారారు? అన్నదే కథ. నేటి టెక్నాలజీ, సోషల్‌ మీడియా, హ్యాకింగ్‌ వంటి అంశాలను కీలకంగా చూపించాం’’ అన్నారు. ‘‘త్వరలో ట్రైలర్‌ను, పాటల్ని విడుదల చేస్తాం. మార్చి 16న తెలుగు, హిందీలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు విజయరామరాజు, హేమంత్‌. ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్‌ అభిమన్యు, సంగీతం: అరుణ్‌ చిలువేరు.

మరిన్ని వార్తలు