‘ మైదాన్‌’ విడుదల మార్పు.. డిసెంబర్‌ 11న

3 Feb, 2020 20:31 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగన్‌  ఫుట్‌బాల్‌ కోచ్‌గా నటిస్తున్న సినిమా ‘మైదాన్‌’. ఈ సినిమాలో అజయ్‌ ఇండియన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌, మేనేజర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ పాత్రలో నటిస్తున్నారు. ‘మైదాన్‌’ చిత్రం అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో అజయ్‌ భార్యగా ప్రియమణి నటిస్తున్నారు. ‘ మైదాన్‌’  సినిమాకు ‘బదాయిహో’ ఫేమ్‌ అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. బోనీ కపూర్, ఆకాశ్‌ చావ్లా, అరునవ జోయ్‌ గుప్తా నిర్మిస్తున్నారు. చదవండి: బాక్సాఫీస్‌పై తాన్హాజీ దండయాత్ర

‘మైదాన్‌’ చిత్రం హింది, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో 11 డిసెంబర్‌ 2020కి విడుదల కానుందని చిత్ర బృందం ప్రకటించింది. గతంలో 27 నవంబర్‌ 2020కి ప్రేక్షకుల ముందు వస్తుందని.. ‘మైదాన్‌’ చిత్రం బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, కొన్ని కారణాల వల్ల ‘మైదాన్‌’ విడుదల తేదీని మార్పు చేశారు. తాజాగా ఈ మూవీ యూనిట్‌ కొత్త విడుదల తేదితో కూడిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అదేవిధంగా ‘మైదాన్‌’ మూవీ విడుదల విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు