అజయ్ దేవ్గన్ 'శివాయ్' ఫస్ట్ లుక్

27 Dec, 2015 11:40 IST|Sakshi
అజయ్ దేవ్గన్ 'శివాయ్' ఫస్ట్ లుక్

సింగం, సింగం రిటర్న్స్, యాక్షన్ జాక్సన్ సినిమాలో యాక్షన్ హీరోగా టర్న్ తీసుకున్న అజయ్ దేవ్ గన్ స్వయంగా డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న సినిమా శివాయ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ ను తన ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు అజయ్ దేవ్గన్. అజయ్ కేవలం ఓ తాడు సాయంతో భారీ కొండకు వేళాడుతున్న ఈ ఫస్ట్ లుక్, ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులకు షాక్ ఇచ్చింది.

ఎతైన ప్రదేశాలంటే తనకున్న భయాన్ని పొగొట్టేందుకు స్టంట్ మాస్టర్ ఇలా ప్లాన్ చేశాడంటూ సరదా ట్వీట్ చేసిన అజయ్ దేవ్గన్, గతంలోనూ యాక్షన్ సీక్వన్స్ ల షూటింగ్ మొదలు పెట్టిన సమయంలో లోకేషన్లలో భారీ క్రేన్ లతో ఏర్పాట్లు చేస్తున్నఫోటోను కూడా ట్వీట్ చేశాడు. అజయ్ దేవ్గన్ సరసన అఖిల్ ఫేం సయోషా సైగల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను 2016 దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.