నాకంటే అజయ్‌ బెటర్‌

10 Jun, 2018 01:41 IST|Sakshi
కాజోల్‌

అజయ్‌ దేవగన్, కాజోల్‌ బాలీవుడ్‌ లవ్లీ కఫుల్‌. పిల్లల్ని చూసే విషయంలో మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్‌? అని కాజోల్‌ని అడిగితే ‘అజయే బెస్‌ట అంటున్నారు కాజోల్‌. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నా కంటే అజయే పిల్లల్ని ఎక్కువ గారం చేస్తుంటాడు. పిల్లల్ని గారం చేసే విషయంలో నేను చాలా స్ట్రిక్ట్‌ మదర్‌ని. వాళ్ల డైలీ రొటీన్, గేమ్స్‌ టైమింగ్స్‌లో, ఫుడ్‌ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటాను. వాళ్లను లిమిట్‌ దాటి అల్లరి సాగనివ్వను. కానీ అజయ్‌ మాత్రం ఆ విషయంలో వాళ్లను పూర్తిగా వదిలేస్తాడు’’ అని పేర్కొన్నారామె.

మరిన్ని వార్తలు