కత్తి కంటే పదునైనది మెదడు

22 Oct, 2019 05:45 IST|Sakshi
తన్హాజీ పోస్టర్‌

‘టోటల్‌ ధమాల్, దేదే ప్యార్‌ దే’ వంటి హిట్స్‌ తర్వాత బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ చారిత్రాత్మక సినిమాతో రాబోతున్నారు. మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ సైన్యానికి నాయకత్వం వహించిన సుబేదార్‌ తన్హాజీ మలుసరే జీవితం ఆధారంగా ‘తన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ అనే సినిమా తెరకెక్కుతోంది. అజయ్‌ దేవగన్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్రలో, కాజోల్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వంలో ఈ సినిమాను అజయ్‌ దేవగన్, భూషణ్‌ కుమార్, కృష్ణ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్‌ దేవగన్, సైఫ్‌ అలీఖాన్‌ లుక్స్‌ను సోమవారం విడుదల చేశారు. అజయ్‌ తన లుక్‌ని షేర్‌ చేసి ‘‘మెదడు.. కత్తికంటే కంటే చాలా పదునైనది’  అని పేర్కొన్నారు. జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది.
 

>
మరిన్ని వార్తలు