'అతడు నాకు సోదరుడిలాంటివాడు'

14 Jun, 2015 15:16 IST|Sakshi
'అతడు నాకు సోదరుడిలాంటివాడు'

ముంబయి: అజయ్ దేవ్గన్తో తనకు ఉన్న బంధం చాలా దృఢమైనదని ప్రముఖ బాలీవుడ్ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి అన్నారు. ఆయనతో తనకు ఉన్న సంబంధం అన్నాదమ్ములలాంటి సంబంధం అని చెప్పారు. ఆయన తనకు కుటుంబ సభ్యుడిలాంటివారని చెప్పారు.

అజయ్ తో తనకు 25 సంవత్సరాల సన్నిహిత సంబంధం ఉందని తాము ఒకరికొకరం గోల్ మాల్ సిరీస్, సింగమ్, బోల్ బచ్చన్ తో సహా మొత్తం తొమ్మిది చిత్రాలకు పనిచేశామని ఇంకా కలిసి పనిచేస్తామని తెలిపారు. షారుఖ్ ఖాన్ తో చిత్రాలు తీసి హిట్ కొట్టిన రోహిత్ శెట్టికి ఇక ముందు అజయ్ దేవ్ గన్ తో సంబంధాలు బలహీన పడినట్లేనా అంటూ వస్తున్న వదంతులకు ఆయన ఈ విధంగా సమాధానాలు ఇచ్చారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి