నెక్ట్స్‌ సినిమా కూడా అదే హీరోతో..!

24 Jan, 2019 13:05 IST|Sakshi

ఈ జనరేషన్‌ హీరోలు సూపర్‌ హిట్ ఇచ్చిన దర్శకులతో కూడా వెంటనే వర్క్‌ చేసేందుకు ఇంట్రస్ట్ చూపించటంలేదు. అలాంటి పరిస్థితుల్లో ఒకే కాంబినేషన్లో వరుస సినిమాలు రావటం అంటే విశేషంగానే చెప్పుకోవాలి. అలాంటి అరుదైన రికార్డ్‌ను మరోసారి రిపీట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు కోలీవుడ్ స్టార్స్‌. కోలీవుడ్ లో రజనీకాంత్‌ తరువాత అదే స్థాయిలో మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటుడు అజిత్‌.

అలాంటి కమర్షియల్ హీరో వరుసగా ఒకే దర్శకుడితో సినిమా చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌ గామారింది. వీరం సినిమాతో అజిత్, శివల కాంబినేషన్‌ సూపర్‌ హిట్ అందుకుంది. తరువాత ఇదే కాంబినేషన్‌లో వచ్చిన వేదలం, వివేగం సినిమాలు కూడా కమర్షియల్‌గా సక్సెష్ కావటంతో తాజాగా మరోసారి విశ్వాసంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అజిత్‌, శివ. ఇది రోటీన్‌ సినిమా అన్న టాక్ వినిపించిన కలెక్షన్లు మాత్రం సూపర్బ్‌గా ఉన్నాయి.

దీంతో మరోసారి ఇదే కాంబినేషన్‌ను రిపీట్ చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్‌ హిట్ పింక్‌ కు రీమేక్‌ గా తెరకెక్కుతున్న  సినిమాలో నటిస్తున్న అజిత్‌ ఆ సినిమా తరువాత మరోసారి శివ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడట. శివ మాత్రం ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయకుండా అజిత్‌ చేయబోయే సినిమాకు స్క్రిప్ట్‌ రెడీ చేయనున్నాడట.

మరిన్ని వార్తలు