10 Nov, 2018 11:18 IST|Sakshi

కోలీవుడ్ టాప్‌ స్టార్‌ తలా అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వాసం. అజిత్‌ హీరోగా వీరం, వేదలం, వివేగం లాంటి సూపర్‌ హిట్స్ అందించిన శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సత్యజ్యోతి ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాలో అజిత్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రషూటింగ్ పనులు పూర్తయ్యాయి.

ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్‌ సినిమాను 2019 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. వివేగం సినిమా తరువాత అజిత్‌ లాంగ్‌ గ్యాప్ తీసుకోవటంతో విశ్వాసం సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. శివ మార్క్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అజిత్‌కు మరో సూపర్‌ హిట్‌ కన్ఫామ్‌ అంటున్నారు ఫ్యాన్స్‌.

మరిన్ని వార్తలు