ఆ సినిమా ఆగిపోలేదట..!

25 Jun, 2016 04:19 IST|Sakshi
ఆ సినిమా ఆగిపోలేదట..!

ఆడో రకం.. ఇడో రకం తరువాత యంగ్ హీరో రాజ్ తరుణ్పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడని, స్క్రిప్ట్, దర్శకత్వం లాంటి వాటిల్లో ఇబ్బంది పెడుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే పెద్ద నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన ఆఫర్స్ కూడా ఈ యంగ్ హీరోకు దూరమయ్యాయన్న ప్రచారం జరుగుతోంది.

రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సినిమా చేస్తున్నాడు. రక్ష సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమా కూడా ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. రాజ్ తరుణ్ ప్రవర్తన వల్లే దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకొన్నాడని భావించారు. అయితే అలాంటిదేమీ లేదని చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యిందని, త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలవుతుందని ప్రకటించారు.

అంతేకాదు రాజ్ తరుణ్ హీరోగా మరో సినిమాను కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు. ఈ సినిమాతో సంజనారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత ప్రముఖ రచయిత వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఏకె ఎంటర్టైన్మెంట్స్ మూడో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి