రేపే ‘రొమాంటిక్‌’ ఫస్ట్‌ లుక్‌

29 Sep, 2019 18:34 IST|Sakshi

టాలీవుడ్‌ డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఎంతో మంది హీరోలకు ఎనలేని క్రేజ్‌ను సంపాదించిపెట్టాడు. అయితే సొంతకొడుకు అయిన ఆకాష్‌కు మాత్రం ఒక్క హిట్టు ఇవ్వలేకపోతున్నాడు. తన నిర్మాణంలో సినిమా చేపట్టినా, తన దర్శకత్వంలో సినిమా తెరకెక్కించినా హీరోగా మాత్రం నిలబెట్టలేకపోతున్నాడు.

చివరగా మెహబూబా అంటూ ఆకాశ్‌ పూరి పలకరించినా.. అంతగా మెప్పించలేకపోయాడు. అయితే ఈ సారి ‘రొమాంటిక్‌’ ఫెల్లోగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. మరి పూరి శిష్యుడైన అనిల్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పైన నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఓ అప్‌డేట్‌ వచ్చేసింది. రేపు (సెప్టెంబర్‌ 30) ఉదయం 11 గంటలకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరి ఈ సినిమాతోనైనా ఆకాశ్‌ హిట్టు కొడతాడా? లేదా అన్నది చూడాలి.

వారెవ్వా క్రేజీ కేతికా.. అదరగొట్టిన ఫస్ట్‌లుక్‌ 

మరిన్ని వార్తలు