వినాయక్‌ది పదమూడేళ్ల సక్సెస్ఫుల్ కెరీర్. అక్కినేని అఖిల్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న ‘అఖిల్’ ఆయనకు 14వ చిత్రం. ‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్’ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే వినాయక్ ‘అఖిల్’ని మాస్‌గా, ఎనర్జిటిక్‌గా తెరపై ఆవిష్కరించడానికి తన సర్వశక్తులూ కేంద్రీకరిస్తున్నారు. ఇంతకూ ‘అఖిల్’ ఏ తరహా సినిమా? ‘అఖిల్’ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది? ఇత్యాది విషయాల్లో చాలా గోప్యత పాటిస్తున్నారు. హీరో నితిన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ బిజీలో అహోరాత్రాలు శ్రమిస్తున్న వినాయక్ పుట్టిన రోజు నేడు.