హలో... టైటిల్‌ ఇదే!?

21 Aug, 2017 00:43 IST|Sakshi
హలో... టైటిల్‌ ఇదే!?

హలో... హలో... హలో... అక్కినేని అభిమానుల్లో ఇప్పుడీ సౌండ్‌ ఎకోలో వినిపిస్తోంది. ఎందుకంటే... అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న సినిమా టైటిల్‌ ‘హలో’ అట! నేడు ఈ సిన్మా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే... రెండు రోజుల క్రితం ‘నిర్ణయం’లోని ‘హలో గురూ ప్రేమ కోసమేరోయ్‌ జీవితం...’ పాటను ట్వీట్‌ చేసిన నాగార్జున... ‘‘ఇందులో అఖిల్‌ సినిమా టైటిల్‌ ఉంది. కనుక్కోండి’’ అన్నారు. ఆదివారం నాగచైతన్య ‘ఏ మాయ చేసావె’లో ‘ఈ హృదయం’ పాట ర్యాప్‌ను పోస్ట్‌ చేసి సెకండ్‌ క్లూ ఇచ్చారు. రెండిటిలోనూ కామన్‌గా ఉన్నది ‘హలో’ అనే పదం ఒక్కటే. సో, అదే అఖిల్‌ సినిమా టైటిల్‌ అయ్యుంటుందని అక్కినేని అభిమానులు, ప్రేక్షకులు ఫిక్సయ్యారు. వాళ్ల అంచనా నిజమో? కాదో? ఈ రోజు తెలుస్తుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి