అఖిల్ కొత్త సినిమాకు యంగ్ డైరెక్టర్‌..?

10 Mar, 2018 11:34 IST|Sakshi
హీరో అఖిల్, దర్శకుడు వెంకీ అట్లూరి

‘అఖిల్’ సినిమాతో గ్రాండ్‌గా లాంచ్‌ అయిన అక్కినేని యువ కథానాయకుడు తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో రెండో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల హలో అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్, మంచి మార్కులు సాధించిన బ్లాక్ బస్టర్‌ సక్సెస్‌ మాత్రం సాధించలేకపోయాడు. దీంతో మూడో సినిమా కోసం మరోసారి గట్టి కసరత్తులు చేస్తున్నాడు.

ఇటీవల అఖిల్.. రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపించాయి. ఈ సినిమాకు సంబంధించిన టెస్ట్‌ షూట్‌ కూడా జరిగిందన్న ప్రచారం తెరమీదకు వచ్చింది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇటీవల తొలి ప్రేమ సినిమాతో సూపర్‌ హిట్ సాధించిన వెంకీ అట్లూరి, అఖిల్ మూడో సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. ఈ సినిమాను బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. ఏప్రిల్‌లోనే సినిమా ప్రారంభం కానుందన్న ప్రచారం జరుగుతోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు