అఖిల్‌ సరసన?

30 Jul, 2019 06:17 IST|Sakshi

ముందు జోడీ లేకుండానే అఖిల్‌ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు తనతో పాటు ‘గ్యాంగ్‌లీడర్‌’ భామ కూడా జాయిన్‌ కానున్నారని తెలిసింది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా ఫిక్స్‌ కాలేదు. నాని ‘గ్యాంగ్‌లీడర్‌’లో హీరోయిన్‌గా నటించిన ప్రియా మోహన్‌ను అఖిల్‌ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్‌ చేస్తోందట చిత్రబృందం. జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు