టాలీవుడ్కి కంగ్రాట్స్ చెప్పిన అఖిల్

1 Jul, 2016 14:34 IST|Sakshi

మెగాస్టార్ 150 సినిమాపై అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఎంతో ఆసక్తి ఉంది. ముఖ్యంగా ఈ సినిమా పై క్రియేట్ అయిన హైప్, సినిమా ప్రారంభ సమయంలో చిరు లుక్స్, అన్ని సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి. ముఖ్యంగా సినీ వేడుకల్లో చిరంజీవి కొత్త సినిమాపై భారీగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన సినీ మా అవార్డ్స్ ఫంక్షన్లో వేదిక మీద పర్ఫామ్ చేసి అందరినీ అలరించాడు మెగాస్టార్.

అయితే సింగపూర్ వేదికగా జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్లోనూ చిరు మేనియా కనిపించింది. ఏదో మెగా ఫ్యామిలీ హీరో చిరు గురించి చెప్పటం కాదు. ఏకంగా అక్కినేని వారసుడు అఖిల్ చిరంజీవి రీ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మెగాస్టార్ ఈజ్ బ్యాక్.. అందుకే నేను ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు శుభాకాంక్షలు చెబుతున్నా' అన్నాడు అఖిల్. సైమా 2016 అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ నూతన నటుడిగా అవార్డ్ అందుకున్న అఖిల్ ఈ కామెంట్స్ చేశాడు.