ఎలా బయటపడ్డారు

29 Jun, 2018 01:30 IST|Sakshi
ఇంద్రజ, వినోద్‌కుమార్

శివ కంఠంనేని, రవిబాబు, వినోద్‌కుమార్, ఇంద్రజ, రామ్‌ కార్తీక్, శివ హరీశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. శ్రీపాద విశ్వక్‌ దర్శకత్వంలో కె. శివశంకర రావు, రావుల వెంకటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రావుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘కాన్సెప్ట్‌ బేస్డ్‌ చిత్రమిది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రకథ బాగా నచ్చి నిర్మించా’’ అన్నారు.

‘‘నటనకు అవకాశం ఉన్న పాత్ర చేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శివ కంఠమనేని. శ్రీపాద విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ – ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ఓ ప్రేమ జంట స్నేహితుల సహాయం పొందే సమయంలో మరో అపాయం ఎదురవుతుంది. వాటి నుంచి ప్రేమ జంట,  ఫ్రెండ్స్‌ ఎలా బయటపడ్డారు? అన్నదే కథ. యాక్షన్, సస్పెన్స్‌ ఉన్న చిత్రం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: జి. రాంబాబు యాదవ్, ఎన్‌.వి. గోపాల్‌రావు, కె.శ్రీధర్‌ రెడ్డి, సంగీతం: సార్క్స్‌.

మరిన్ని వార్తలు