అదే మా సక్సెస్‌

5 Feb, 2019 03:09 IST|Sakshi
శివ కంఠంనేని

‘‘అక్కడొకడుంటాడు’ చిత్రం విడుదలైన మొదటి రెండు రోజులు కలెక్షన్లు సాధారణంగా ఉన్నా మౌత్‌ టాక్‌తో ఆదివారం నుంచి కలెక్షన్లు బాగా పెరిగాయి. ‘భారతీయుడు, అపరిచితుడు’ చిత్రాల కోవలో మా సినిమాలో అండర్‌ కరెంట్‌గా డ్రంకన్‌ డ్రైవ్‌ పైన సందేశం ఉంటుంది. ఇది పూర్తి కమర్షియల్‌ చిత్రం. నిర్మాత సి.కల్యాణ్‌గారి వల్లే మాకు మంచి థియేటర్లు లభించాయి’’ అని శివ కంఠంనేని అన్నారు. రామ్‌ కార్తీక్, శివహరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక హీరోహీరోయిన్లుగా శివ కంఠంనేని లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’.

శ్రీపాద విశ్వక్‌ దర్శకత్వంలో కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది.హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో శ్రీపాద విశ్వక్‌ మాట్లాడుతూ– ‘‘కొత్తదనానికి పట్టం కడుతున్న నేటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తీసిన చిత్రమిది. చివరి వరకూ సస్పెన్స్‌ కొనసాగుతూ ప్రేక్షకులకు థ్రిల్‌ కలిగిస్తోంది. మేము అనుకున్నట్టు ప్రేక్షకులకు చేరువయ్యాం’’ అన్నారు. ‘‘సినిమా ఆరంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఉత్కంఠగా సాగుతూ ప్రేక్షకులను కూర్చోబెడుతోంది. అదే మా సక్సెస్‌’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. శివహరీష్, అలేఖ్య, రసజ్ఞ దీపిక, డిస్ట్రిబ్యూటర్‌ దాసరి శ్రీనివాస్, చిత్ర నిర్వాహకులు ఘంటా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.       

మరిన్ని వార్తలు