అక్కడొకడుంటాడు... లెక్క గడుతుంటాడు!

4 Jan, 2019 04:16 IST|Sakshi
శివ కంఠంనేని, అశోక్‌కుమార్, కల్యాణ్, రావుల వెంకటేశ్వరరావు

రామ్‌కార్తీక్, శివ హరీష్, రసజ్ఞదీపిక, అలేఖ్య హీరోహీరోయిన్లుగా శివ కంఠంనేని, ‘అల్లరి’ రవిబాబు, వినోద్‌ కుమార్, ఇంద్రజ ముఖ్య తారలుగా శ్రీపాద విశ్వక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. లైట్‌హౌస్‌ సినీ మ్యాజిక్‌ పతాకంపై కె.శివశంకరరావు, రావుల వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా తర్వలో విడుదల కానుంది. ‘అక్కడొకడుంటాడు... లెక్క గడుతుంటాడు...’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌ని నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్‌ కుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘డ్రంకన్‌ డ్రైవ్‌ నేపథ్యంలో సాగే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ సినిమా నేను చూశా. మంచి సందేశం ఉంది.

శివ కంఠంనేని సీనియర్‌ నటుల కోవలో తన పాత్రలో ఒదిగిపోయాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా నేను కూడా చూశా. కొత్త నిర్మాతలు తీశారనే భావన ఎక్కడా కలగదు. పేరెంట్స్‌తో పాటు యువత చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు అశోక్‌ కుమార్‌. ‘‘మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి ఫ్రేమ్‌ వరకూ ప్రేక్షకులను కదలనివ్వకుండా కూర్చోబెట్టే చిత్రమిది’’ అన్నారు శివ కంఠంనేని. ‘‘ఈ నెలాఖరులో సినిమా విడుదల చేస్తున్నాం’’ అని రావుల వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీపాద విశ్వక్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్‌.రాజశేఖరన్, సంగీతం: సార్క్స్, సహనిర్మాతలు: జి.రాంబాబు యాదవ్, ఎన్‌.వి.గోపాలరావు, కె. శ్రీధర్‌రెడ్డి.

మరిన్ని వార్తలు