స్నేహితుల సాయంతో...

18 Jan, 2019 01:01 IST|Sakshi
శివ కంఠంనేని

శివ కంఠంనేని టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘అక్కడొకడుంటాడు’. లైట్‌ హౌస్‌ సినీ మ్యాజిక్‌ పతాకంపై కె. శివశంకర్‌ రావు, రావుల వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. శ్రీపాద విశ్వక్‌ దర్శకుడు. రామ్‌ కార్తీక్, శివ హరీశ్, అలేఖ్య, రసజ్ఞ దీపికా హీరో, హీరోయిన్లు. సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ట్రైలర్‌ను ప్రముఖ హీరో నాగశౌర్య విడుదల చేయగా, ఈ చిత్రంలోని ‘ఆడి పాడి గడిపేద్దాం..’ అనే పాటను ప్రముఖ నిర్మాత కె.యస్‌. రామారావు విడుదల చేశారు.

‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్‌లు ఆకట్టుకున్నాయి’’ అన్నారు నాగశౌర్య. ‘‘టైటిల్‌ పాత్రలో శివ కంఠంనేని బాగా ఒదిగిపోయారు’’ అన్నారు కేయస్‌ రామారావు. ‘‘డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ వల్ల జరిగే అనర్థాలను మా చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు శివ కంఠంనేని. శ్రీపాద విశ్వక్‌ మాట్లాడుతూ– ‘‘అనుకోని ఆపదలో చిక్కుకున్న ప్రేమజంటకు స్నేహితుల సహాయం అందే సమయంలో మరో అపాయం ఎదురవుతుంది. ఆ ప్రేమ జంట ఎలా బయటపడుతుందనే అంశంతో లె రకెక్కిన చిత్రమిది. త్వరలోనే సినిమాలోని అన్ని పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు