‘మామయ్యకు మహా ఇష్టం’

13 Jul, 2019 08:23 IST|Sakshi

పంజగుట్ట: నా మాతృభాష బెంగాళీ.. మా మామయ్య అక్కినేని నాగేశ్వరరావుకు బెంగాళీ సినిమాలంటే ఎంతో ఇష్టమని, పలు సినిమాలను తెలుగులో రీమేక్‌ చేశారని ప్రముఖ నటి అక్కినేని అమల అన్నారు. బెంగాళీస్‌ ఇన్‌ హైదరాబాద్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్న ఆరవ ‘హైదరాబాద్‌ బెంగాళీ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ వివరాలను ఎర్రమంజిల్‌లోని హోటల్‌ మెర్క్యూరీలో శుక్రవారం వివరించారు. కార్యక్రమానికి హాజరైన అమల మాట్లాడుతూ.. మా మామయ్యకు బెంగాళ్‌ సినిమాలంటే ఎంతో మక్కువ అన్నారు.

ఈ ఫెస్టివల్‌కు 50 మంది ప్రముఖులు బెంగాళ్, ఇతర రాష్ట్రాల నుంచి హాజరుకావడం సంతోషకరమన్నారు. ఫెస్టివల్‌ డైరెక్టర్‌ పార్థ పాతమ్‌ మలిక్‌ మాట్లాడుతూ.. ఫెస్టివల్‌ను ఈ నెల 18వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలోని శివ థియేటర్‌లో ప్రారంభిస్తున్నప్పటికీ అధికారికంగా 19వ తేదీన బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ సినీ నిర్మాత బుద్దదేబ్‌ దాస్‌గుప్త ప్రారంభిస్తారని తెలిపారు. బెంగాళి సినిమా ఈ యేడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దిగ్గజాల సినిమాలు ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. బెంగాలి ఇన్‌ హైదరాబాద్‌ అధ్యక్షురాలు మోసొమి శర్మ, జాయింట్‌ కన్వీనర్‌ మాలిక్‌ బసు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు