మిషన్‌ ముంబై

6 Jan, 2020 03:00 IST|Sakshi
నాగార్జున

ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌వర్మ ఓ మిషన్‌ నిమిత్తం ముంబై ప్రయాణమయ్యారు. మరి ఈ మిషన్‌ వెనుక ఉద్దేశం ఏంటో తెలియడానికి ఇంకా సమయం ఉంది. నాగార్జున హీరోగా నూతన దర్శకుడు అషిషోర్‌ సోల్మాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ ఈ నెల 9 నుంచి ముంబైలో ప్రారంభంకానుంది.  ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారు యూనిట్‌. వేసవికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: షానీ డియోల్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా