ఫిల్మ్ చాంబర్కి అక్కినేని పార్థివదేహం

23 Jan, 2014 12:16 IST|Sakshi
ఫిల్మ్ చాంబర్కి అక్కినేని పార్థివదేహం

హైదరాబాద్ : నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పార్థీవ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు అన్నపూర్ణ స్టూడియో నుంచి ఫిల్మ్ ఛాంబర్కు తరలిస్తున్నారు. భౌతికకాయన్ని తరలిస్తు  కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 12.30 గంటలకు ఫిలిం చాంబర్ నుంచి అక్కినేని అంతిమ యాత్ర మొదలవుతుంది. జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ మీదగా ఈ యాత్ర అన్నపూర్ణ స్టూడియోకు చేరుతుంది. అన్నపూర్ణ స్డూడియోలోనే నాగేశ్వరరావుకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అక్కినేని నాగేశ్వరరావు బుధవారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త తెలియగానే సినీ పరిశ్రమ, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజకీయ, చలనచిత్ర, వ్యాపార రంగ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అక్కినేనికి నివాళులు అర్పించారు. రెండో రోజు కూడా అక్కినేనిని కడసారి దర్శించుకునేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు.