అందుకే మతం మారాను: నటి

26 Jul, 2017 20:16 IST|Sakshi
అందుకే మతం మారాను: నటి

చెన్నై: ఆస్తికత్వంపై నమ్మకం లేదంటూనే బౌద్ధమతానికి మారానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ రెండో కూతురు అక్షరహాసన్ చెప్పింది‌. ఆ మధ్య షమితాబ్‌ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన ఈ బ్యూటీ తాజాగా స్టార్ హీరో అజిత్‌ కథానాయకుడిగా నటిస్తున్న వివేగం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ నేపథ్యంలో అక్షరహాసన్‌ ఇటీవల చెన్నైలో విలేకరులతో మాట్లాడింది. చిన్ననాటి నుంచే దర్శకత్వంపై ఆసక్తి  ఉందని ఆమె తెలిపింది. ముంబయిలో కొన్ని చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పని చేశానని చెప్పింది.

'ప్రస్తుతం నటనపై ఆసక్తి కలగడంతో అటుగా దృష్టి సారిస్తున్నాను. అమ్మా, నాన్న, అక్క, ఇతర బంధువులు అందరూ ఈ రంగంలోనే ఉన్నారు. వారందరితో ఒక మూవీ చేయాలనుంది. ముందు దర్శకురాలిగా ఓ విజయం సాధించిన తరువాత అమ్మానాన్న, అక్క కాల్‌షీట్స్‌ తీసుకుని వారితో సినిమా చేస్తాను. నాకు అక్క మాదిరి దేవుడిపై నమ్మకం లేదు. అయితే ఆసక్తితోనే బౌద్దమతం స్వీకరించాను. నాన్న కమల్‌హాసన్‌ గురించి చాలా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా.. లేదా.. అన్నది ఆయన ఇష్టం. దాని గురించి మాట్లాడబోనని' నటి అక్షరహాసన్‌ స్పష్టం చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి