లఘు చిత్రంలో!

17 May, 2016 00:37 IST|Sakshi
లఘు చిత్రంలో!

కమల్‌హాసన్ రెండో కుమార్తె అక్షరా హాసన్ ముందు దర్శకత్వ శాఖలో సహాయ దర్శకురాలిగా చేసి, ఆ తర్వాత ‘షమితాబ్’ చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత హిందీలో అక్షరకు ఆశించినంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం తన తండ్రి కమల్, అక్క శ్రుతీహాసన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘శభాష్ నాయుడు’కి సహాయ దర్శకురాలిగా చేస్తున్నారామె.

అలాగే, ‘సెంట్ ఆఫ్ ఎ ఉమన్’ అనే షార్ట్ ఫిలింలో నటించారు. ఈ లఘు చిత్రంలో మాజీ కథానాయిక రతీ అగ్నిహోత్రి తనయుడు తనూజ్ వీర్వాని సరసన ఆమె జత కట్టారు. ఇదొక థ్రిల్లర్ మూవీ. ఈ చిత్రంలో నటించడంతో పాటు తనూజ్ దర్శకత్వం కూడా వహించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి