పిల్లలకోసం అక్షరం...

30 Jun, 2019 06:07 IST|Sakshi
లోహిత్, శ్రీకాంత్, జాకీ

అక్షరం తెలిస్తే సమాజంలో ఎక్కడైనా బతకొచ్చు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే క్రమంలో మన ప్రభుత్వాలు విద్యకు పెద్దపీట వేస్తున్నాయి. పిఎల్‌ క్రియేషన్స్‌ పతాకంపై మిమిక్రీ కళాకారునిగా 7000 ప్రదర్శనలిచ్చి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వర ల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాందించిన నటుడు లోహిత్‌ నిర్మాతగా మారి ‘అక్షరం’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ప్రముఖ నటుడు జాకీ తోట ఈ చిత్రానికి దర్శకుడు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ను, ఫస్ట్‌ లుక్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేశారు.

జాకీ మాట్లాడుతూ– ‘‘నేను మొదటిసారిగా దర్శకత్వం చేసిన చిత్రం ఇది. సినిమా బాగా వచ్చింది. ప్రతి పేక్షకుడు చూడాల్సిన చిత్రం ‘అక్షరం’’ అన్నారు. లోహిత్‌ మాట్లాడుతూ– ‘‘విద్యావవస్థలో ఉన్న లోపాలను చూపించే సినిమా ఇది. జాకీగారు సినిమా గురించి చెప్పినప్పుడు ఎగ్జైట్‌ అయ్యాను. ఈ సినిమాకి పరుచూరిగారు ఇచ్చిన సూచనలు మర్చిపోలేనివి’’ అన్నారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘అందరినీ ఆలోచింప చేసే విధంగా ఈ సినిమా ఉంటుంది. పిల్లల కోసం పేరెంట్స్‌ ఎంత కష్టపడతారో, వారి భవిష్యత్‌ కోసం ఏమేం చేస్తారో తెలిపే చిత్రమే ‘అక్షరం’’ అన్నారు.

మరిన్ని వార్తలు