అక్షయ్ కుమార్ ఉదారత

15 Dec, 2015 16:16 IST|Sakshi
అక్షయ్ కుమార్ ఉదారత

చెన్నై: బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ కుమార్ తన సహృదయాన్ని చాటుకున్నాడు. చెన్నై వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయలు విరాళం అందించాడు. చెన్నై వరదలు తనను ఎంతో కలచి వేశాయని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అక్షయ్ పేర్కొన్నాడు.

'చెన్నై వరద దృశ్యాలు చూసి చలించిపోయిన అక్షయ్ కుమార్ బాధితులకు తనవంతు సాయం చేయాలని భావించారు. వెంటనే దర్శకుడు ప్రియదర్శన్ కు, సుహాసినికి ఫోన్ చేశారు. సుహానిసిని సలహా మేరకు భూమిక ట్రస్టుకు రూ. కోటి అందించారు' అని ఆ ప్రకటనలో వెల్లడించారు.

చెన్నై వరద బాధితులను ఆదుకునేందుకు భూమిక ట్రస్టు విశేష సేవలు అందిస్తోంది. అక్షయ్ కుమార్ నుంచి భూమిక ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ, దర్శకనిర్మాత జయేంద్ర రూ. కోటి చెక్కు అందుకున్నారు. షారూఖ్ ఖాన్ 'దిల్ వాలే' టీమ్ కూడా చెన్నై వరద బాధితులకు రూ. కోటి సహాయం చేసింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా