కరోనా: ‘భుజ బలం, బుద్ధి బలం.. అవసరం లేదు’

24 Mar, 2020 21:10 IST|Sakshi

ముంబై: లాక్‌డౌన్‌ను తేలికగా తీసుకుంటున్నవారిపై బాలీవుడ్‌ ఖిలాడి అక్షయ్‌కుమార్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా బారినుంచి రక్షించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటిస్తే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన ట్విటర్‌ వేదికగా ధ్వజమెత్తారు. మూర్ఖుల్లా వ్యవహరించి మీతో పాటు.. మీ కుటుంబాలను.. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టొద్దని హితవు పలికారు. ‘లాక్‌డౌన్‌ అంటేనే ఇల్లు వదిలి బయటకు రాకుండా ఉండటం. తద్వారా ప్రజలంతా సామాజిక దూరం పాటించి ప్రాణాంతక వైరస్‌ను జయించొచ్చని సర్కార్‌ ఈ నిర్ణయం తీసకుంది. కానీ, చాలా మంది తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారు.

నిబంధనల్ని పాటించకుండా రోడ్లపైకొస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. మీతో పాటు మిగతావారిని ఇబ్బందుల్లో పెట్టొద్దు. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా గజగజగ వణుకుతోంది. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఇంటివద్దనే ఉండండి. మీ కుంటుంబానికి.. ప్రపంచానికి హీరో కండి. సర్కార్‌ లాక్‌డౌన్‌ ఎత్తివేసే వరకు బయటకు రావొద్దు. ఇది శత్రువులతో  పోరాటం కాదు. భుజ బలం, బుద్ధి బలం చూపించి ప్రత్యర్థులను చిత్తు చేయడానికి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఇంటి వద్ద ఉంటే చాలు. ఇంటి వద్దే ఉండి ఖిలాడీగా ఉంటారో.. లేక మూర్ఖులుగా ఉంటారా తేల్చుకోండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి’అని అక్షయ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు