ఇదేంది అక్షయ్‌.. ఇట్లా చేస్తివి!?

1 May, 2019 13:56 IST|Sakshi

చేసేది దేశభక్తి సినిమాలు.. చెప్పేది ఓటు ఎంతో శక్తిమంతమైనదని నీతులు.. కానీ తీరా పోలింగ్‌నాడు ఆయన కనిపించనే లేదు. వేలికి సిరా గుర్తు పెట్టుకొని.. గర్వంగా ఫొటో దిగలేదు. తోటి సినీ స్టార్లు పెద్ద ఎత్తున కదిలివచ్చి ఓటు వేసినా.. ఆయన మాత్రం ఇంటికి పరిమితమయ్యారు. పోలింగ్‌కు కొద్ది రోజులు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రాజకీయేతర వ్యక్తిగత ఇంటర్వ్యూ చేసిన బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ ఓటు వేయకపోవడంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

కేసరి, టాయ్‌లెట్‌ ఏక్‌ ప్రేమ్‌కథా, ఎయిర్‌లిఫ్ట్‌ వంటి దేశభక్తి మేళవించిన కథలతో వరుసగా సూపర్‌హిట్లు కొడుతున్న అక్షయ్‌కుమార్‌ తాజాగా నాలుగో విడత లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదు. విచిత్రమేమిటంటే.. ప్రధాని నరేంద్రమోదీ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కల్పించాలంటూ ట్విటర్‌లో విజ్ఞప్తి చేస్తూ.. ట్యాగ్‌ చేసిన ప్రముఖుల్లో అక్షయ్‌కుమార్‌ కూడా ఉన్నారు. అంతేకాకుండా మోదీ ట్వీట్‌కు బదులిస్తూ.. ఓటు ఎంతో శక్తిమంతమైనదని, దానిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరముందని అక్షయ్‌ చెప్పుకొచ్చారు. తీరా ఓటు వేయని ఆయన మంగళవారం ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొని.. మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేశారు. ఓటు ఎందుకు వేయలేదని మీడియా ప్రశ్నించగా చెలియే.. చెలియే.. (వదిలేయండి) అంటూ దాటవేశారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కీలక భేటీ

బెంగాల్‌లో బీజేపీ కార్యకర్త కాల్చివేత

భారీ మెజారిటీ; కేంద్రమంత్రి పదవిపై కన్ను!

కాంగ్రెస్‌కు కటీఫ్‌ చెపుదాం.. ఓటమికి కారణమదే!

‘రాహుల్‌ సందేశం విన్నా’

నా నిజమైన ఆస్తి మీరే : సోనియా గాంధీ

నేడు వారణాసికి ప్రధాని మోదీ

ఓటమితో కాంగ్రెస్‌ శిబిరంలో కాక..

పట్టు పెంచిన మజ్లిస్‌

ఆర్‌ఎస్‌ఎల్‌పీకి భారీ షాక్‌

ఎన్నికల కోడ్‌ను ఎత్తివేసిన ఈసీ

ఐదోసారి సీఎంగా నవీన్‌

మా అన్నకు ఎవ్వరూ తోడు రాలేదు

కలిసి పనిచేయాలని ఉంది

ప్రపంచ శక్తిగా భారత్‌

మోదీ కేబినెట్‌పై మిత్రపక్షాల కన్ను

మే 30, రాత్రి 7 గంటలు

టార్గెట్‌ @ 125

ఇక అసెంబ్లీ వంతు!

మమతకు అసెంబ్లీ గండం

ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను: వైఎస్‌ జగన్‌

జగన్‌తో భేటీ అద్భుతం

తల్లి ఆశీర్వాదం కోసం గుజరాత్‌కు మోదీ

ఉప్పులేటి కల్పనకు అచ్చిరాని టీడీపీ..

‘ఆది’ నుంచి పార్టీ అంతం వరకూ...

పులివెందుల.. రికార్డుల గర్జన