అక్కీ సో లక్కీ..

22 Aug, 2019 15:28 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్‌ అందుకునే స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నాలుగవ నటుడిగా ఫోర్భ్స్‌ జాబితాలో నిలిచారు. తొలి మూడు స్ధానాల్లో హాలీవుడ్‌ స్టార్లు ద్వాన్‌ జాన్సన్‌, క్రిస్‌ హెమ్స్‌వర్త్‌, రాబర్ట్‌ డౌనీ జూనియర్‌లు నిలిచారు. అక్షయ్‌ కుమార్‌ 2018 జూన్‌ 1 నుంచి 2019 జూన్‌ 1 నాటికి ఏకంగా రూ 466 కోట్లు ఆర్జించారని ఫోర్బ్స్‌ మేగజైన్‌ వెల్లడించింది. ఈ ఏడాది అక్షయ్‌ నటించిన రెండు సినిమాలు కేసరి, మిషన్‌ మంగళ్‌ ఇప్పటికే విడుదలవగా, మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

హౌస్‌ఫుల్‌ 4, గుడ్‌ న్యూస్‌, రాఘవ లారెన్స్‌ నిర్ధేశకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీ బాంబ్‌, సూర్యవంశి, బచన్‌ పాండే వంటి సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. కేవలం సినిమాల్లోనే కాకుండా ప్రకటనలపైనా అక్షయ్‌ భారీగా ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పలు విభాగాలకు చెందిన 20 ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. గతంలో తాను అత్యధిక ఆదాయం ఆర్జించే నటుల సరసన చేరడం గురించి ఓ ఇంటర్వ్యూలో​ప్రస్తావిస్తూ తాను సంపాదించే ప్రతి రూపాయి వెనుక కఠోరశ్రమ దాగిఉందని అక్షయ్‌ చెప్పుకొచ్చారు. డబ్బు సంపాదించడం తనకు ప్రధానమేనని, దాని కోసం తాను ఎంతో చెమటోడ్చుతానని చెప్పారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు