రజనీ కన్నా ఎక్కువ తీసుకుంటున్నాడు

12 Jun, 2016 11:06 IST|Sakshi
రజనీ కన్నా ఎక్కువ తీసుకుంటున్నాడు

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 2.0. ఇదే కాంబినేషన్లో రూపొందిన రోబో సినిమాకు సీక్వల్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించిన రోజుకో వార్త సంచలనం సృష్టిస్తోంది. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్నాడు.

అక్షయ్ చేస్తున్న రోల్కు సంబందించి కొంత షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ నేపథ్యంలో అక్షయ్ రెమ్యూనరేషన్కు సంబందించి ఆసక్తికరమైన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఆసియాలోనే అత్యంత పారితోషికం తీసుకుంటున్న జాబితాలో రజనీకాంత్ రెండో స్థానంలో ఉన్నాడు. హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీచాన్ తరువాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరో రజనీనే.

అయితే రోబో సీక్వల్ కోసం అక్షయ్, రజనీ కన్నా ఎక్కువ పారితోషికం అందుకుంటున్నాడట. ముందుగా ఈ సినిమాలో విలన్ రోల్కు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి బాలీవుడ్ టాప్ స్టార్లను సంప్రదించారు. అయితే నెగెటివ్ రోల్లో నటించటంతో పాటు భారీగా డేట్స్ ఇవ్వాల్సిరావటంతో వాళ్లు అంగీకరించలేదు.

అయితే జాతీయ స్థాయిలో సినిమాకు క్రేజ్ తీసుకు వచ్చేందుకు బాలీవుడ్ స్టార్ తోనే ఆ పాత్ర చేయించాలని భావించిన రోబో యూనిట్ భారీ మొత్తం ఆఫర్ చేసి అక్షయ్ని ఒప్పించారట. ఎంత అన్నది తెలియక పోయినా.. ఈ సినిమాకు రజనీ కన్నా అక్షయ్ కుమారే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి