నేను చీరలో కంఫర్ట్‌గానే ఉన్నా: హీరో

3 Jan, 2020 20:24 IST|Sakshi

చీరలోనే తనకు సౌకర్యంగా ఉందంటున్నాడు బాలీవుడ్‌ ‘కిలాడి’ అక్షయ్‌ కుమార్‌. 2019 ఏడాదిలో విడుదలైన అక్షయ్‌ సినిమాలు బీ- టౌన్‌ బాక్సాఫీసు వద్ద భారీగానే వసూళ్లు రాబట్టాయి. ఇక ఇటీవల విడుదలైన తన ‘గుడ్‌న్యూస్‌’ మూవీ విజయంతో జోష్‌ మీదున్న అక్కీ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో తన అప్‌కమింగ్‌ మూవీ ‘లక్ష్మీ బాంబ్‌’లో పాత్ర గురించి చెప్పుకొచ్చాడు. చీరతో చేసే షూటింగ్‌ షాట్స్‌ తనకు సౌకర్యంగా అనిపించాయన్నాడు. ‘చీరతో షూటింగ్‌లో పాల్గొనడానికి నాకు ఎలాంటి సమస్య లేదు. చెప్పాలంటే చీరలోనే చాలా సౌకర్యంగా ఉంది. భిన్నమైన పాత్రలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. నేను పోషించిన కష్టమైన పాత్రల్లో ఇది ఒకటి. చీరతో అభిమానులను మెప్పించాలంటే దానికి అనుగుణంగా బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది’ అని అక్కీ పేర్కొన్నాడు

కాగా తెలుగు, తమిళ భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘కాంచన’ సినిమాను హిందీలో ‘లక్ష్మీ బాంబ్‌’గా రీమేక్‌ చేస్తున్నాడు దర్శకుడు రాఘవ లారెన్స్‌. ఇందులో అక్షయ్‌ ట్రాన్స్‌ జెండర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను గతంలో షేర్‌ చేసింది మూవీ యూనిట్‌. ఇందులో అక్షయ్‌ ఎరుపు రంగు చీర, నుదుటిన తిలకం పెట్టుకుని.. దేవీమాత విగ్రహం ముందు నిలుచుని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా