పంద్రాగస్టుకి గోల్డ్‌

14 Jun, 2018 00:46 IST|Sakshi
అక్షయ్‌ కుమార్‌

మెడల్‌ కాదు. ఒలింపిక్స్‌ వేదికపై దేశానికి ప్రాతినిథ్యం వహిస్తే చాలనుకునే ప్లేయర్స్‌ చాలామంది ఉన్నారు. ఎందుకంటే... ఒలింపిక్స్‌లో వివిధ దేశాల తరపున అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటారు. అలా 1948లో ఇంగ్లాండ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఇండియన్‌ హాకీ టీమ్‌ ఫస్ట్‌ గోల్డ్‌ మెడల్‌ కొట్టింది. పతకం నెగ్గిన సంతోషంతో దేశ పతాకం రెపరెపలాడింది. ఈ మధురమైన సంఘటనల ఆధారంగా హిందీలో రూపొందిన సినిమా ‘గోల్డ్‌’.

ఇండియన్‌ హాకీ టీమ్‌ ప్లేయర్‌ బల్బీర్‌సింగ్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ నటించారు. రీమా ఖగ్తీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మౌనీ రాయ్, కునాల్‌ కపూర్, అమిత్, వినీత్‌ కీలక పాత్రలు చేశారు. గతేడాది డిసెంబర్‌లో షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్‌ చేయనున్నట్లు అధికారికంగా చిత్రబృందం తెలిపింది. అంటే.. పంద్రాగస్టుకి ‘గోల్డ్‌’ అన్నమాట. గతేడాది ఇండిపెండెన్స్‌ వీక్‌లో ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్షయ్‌ ఈసారి ‘గోల్డ్‌’ సినిమాతో థియేటర్స్‌లోకి రానుండటం విశేషం.

>
మరిన్ని వార్తలు