ఈ సినిమాకు నేనే ప్రొడ్యూసర్‌: బన్నీ కొడుకు

10 Jan, 2020 15:35 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, బన్నీ కాంబినేషన్‌లో ‘జులాయి’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్‌ కమెడియన్‌ సునీల్‌ చాలారోజుల తర్వాత బన్నీతో కలిసి నటిస్తుండటం విశేషం. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా చిత్రబృందం పలు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ మధ్యే లైవ్‌ కన్సర్ట్‌ కూడా ఏర్పాటు చేసింది. తాజాగా ఈ సినిమా మేకింగ్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. ఈ వీడియోలో సినిమా యూనిట్‌ ఆడుతూ- పాడుతూ, నవ్వుతూ- తుళ్లుతూ ఎంతో సరదా సరదాగా సినిమాను పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. (అల.. వైకుంఠపురములో ట్రైలర్)


ఇందులో బన్నీ ఎంట్రీ, ఫైటింగ్‌ సీన్లను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. సెట్‌కు వచ్చిన బన్నీ కొడుకు అయాన్‌ ఈ సినిమాకు నేనే ప్రొడ్యూసర్‌ అని అప్పుడే సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక వీడియో ఆసాంతం బన్నీ, త్రివిక్రమ్‌​ చిత్రబృందం నవ్వులే దర్శనమిస్తున్నాయి. ఇక నవ్వులతో దద్దరిల్లుతున్న మేకింగ్‌ వీడియోను చూస్తే థియేటర్‌ నవ్వులతో పేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా సంక్రాంతి పందెంలోకి అడుగుపెట్టిన ఈ చిత్రం ఆదివారం విడుదల కానుంది. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ దీని కన్నా ఒకరోజు ముందు అంటే జనవరి 11న రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి హీరోలే పోటీపడుతుంటే అభిమానులు ఊరుకుంటారా! పోటాపోటీగా టికెట్లు బుక్‌ చేసుకుంటూ సంక్రాంతి పండగను ముందుగానే జరుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

చదవండి:
‘అల వైకుంఠపురంలో’ ఈవెంట్‌పై క్రిమినల్‌ కేసు

అంతా రెడీ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా