అల.. తొలిరోజు భారీ కలెక్షన్స్‌

13 Jan, 2020 11:41 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు థియేటర్లలో మంచి స్పందన కనిపిస్తోంది. సంక్రాంతి సీజన్‌లో రిలీజ్‌ కావడం.. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత బన్ని-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ రిపీట్‌ కావడం.. పాటలు సెన్సేషన్‌ హిట్‌ కావడం.. చాలా గ్యాప్‌ తర్వాత బన్నీ మళ్లీ తెరమీదకు రావడం.. తదితర అంశాలు ఈ సినిమాకు కలిసి వస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటం.. పాజిటివ్‌ మౌత్‌టాక్‌ ఉండటంతో చిత్రయూనిట్‌ ఇప్పటికే భారీగా సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇటు కలెక్షన్స్‌ పరంగా కూడా అలవైకుంఠపురములో భారీగా వసూళ్లు రాబడుతున్నట్టు తెలుస్తోంది. అధికారిక లెక్కలు రావాల్సి ఉన్నప్పటికీ.. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 45 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు ట్రెడ్‌ అనలిస్ట్‌లు అంచనాలు వేస్తున్నారు. ఇందులో షేర్ రూ. 30 కోట్లు అని భావిస్తున్నారు. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా:  నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.5 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2 కోట్లు, ఈస్ట్-వెస్ట్‌లలో కలిపి రూ. 4.5 కోట్లు, గుంటూరులో రూ. 3 కోట్లు, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో దాదాపు రూ. 3 కోట్లు రాబట్టినట్టు అంచనా వేస్తున్నారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు సుమారు రూ. 20 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఓవర్సీస్‌లో రూ. 5 కోట్లు, కేరళ, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో మూడున్నర కోట్లుపైగానే వసూలు చేసినట్టుగా సమాచారం. 

ఇక అల వైకుంఠపురములో.. పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుండటంతో సంక్రాంత్రి విన్నర్‌ అంటు చిత్రయూనిట్‌ పోస్టర్‌, ప్రొమో వీడియోలను విడుదల చేసి.. సినిమా ప్రమోషన్‌ను మరింతగా పెంచింది. 

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా