ఆ రెండు సినిమాలకు అల్లాద్దీన్‌ షాక్‌!

26 May, 2019 18:13 IST|Sakshi

భారత్‌లో హాలీవుడ్‌ సినిమాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన సినిమాలతో సమానంగా హాలీవుడ్‌ సినిమాలు వసూళ్లు కూడా సాధిస్తున్నాయి. మొన్న విడుదలైన అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌ సినిమా వసూళ్ల సునామిని సృష్టించిందని చెప్పొచ్చు. విషయంలోకి వస్తే! బాలీవుడ్‌ సినిమాలు.. ఇండియాస్‌ మోస్ట్‌ వాంటెడ్‌, పీఎం నరేంద్ర మోదీ సినిమాలకు అల్లాద్దీన్‌ షాక్‌ ఇచ్చాడు. రెండు సినిమాలను డామినేట్‌ చేస్తూ వసూళ్లు రాబడుతున్నాడు. విడుదలైన రోజునుంచి ఆ రెండు సినిమాల వసూళ్లు తగ్గుతూ వస్తుంటే అల్లాద్దీన్‌ వసూళ్లు మాత్రం పెరుగుతున్నాయి.

ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విటర్‌ ఖాతలో పేర్కొన్నారు. విడుదలైన రెండు రోజులకు గానూ ఇండియాస్‌ మోస్ట్‌ వాండెట్‌ 5 కోట్లు, పీఎం నరేంద్ర మోదీ 3 కోట్లు, అల్లాద్దీన్‌ 10 కోట్ల మేర వసూళ్లు సాధించాయి. ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా పీఎం నరేంద్ర మోదీ తెరకెక్కగా.. ఇందులో వివేక్‌ ఒబేరాయ్‌ మోదీ పాత్రపోషించారు. అర్జున్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో ఇండియాస్‌ మోస్ట్‌ వాండెట్‌ తెరకెక్కింది.

>
మరిన్ని వార్తలు