న్యూఇయర్‌ గిఫ్ట్‌

30 Dec, 2019 06:45 IST|Sakshi
అల్లు అర్జున్‌, పూజా హెగ్డే

‘‘సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా..’ పాట ఎంత పాపులర్‌ అయిందో మనందరికీ తెలుసు. ఈ సూపర్‌ హిట్‌ పాట టీజర్‌ను న్యూ ఇయర్‌ గిఫ్ట్‌గా డిసెంబర్‌ 31 సాయంత్రం రిలీజ్‌ చేస్తున్నాం’’ అని ‘అల వైకుంఠపురములో’ చిత్రబృందం పేర్కొంది. అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అల్లు అరవింద్, యస్‌. రాధాకృష్ణ నిర్మాతలు. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ (మ్యూజికల్‌ కన్సెర్ట్‌) ఈవెంట్‌ జనవరి 6న హైదరాబాద్‌లో జరగనుంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా జనవరి 12న విడుదలకానుంది.

మరిన్ని వార్తలు