కార్తిక్‌తో ఆ సీన్‌లో నటించాలని ఉంది: నటి కూతురు

25 Jan, 2020 20:57 IST|Sakshi

నెపోటిజమ్‌పై అనన్య పాండేకు మంచి అభిప్రాయం లేదంటున్నారు బాలీవుడ్‌ నటి పూజ బేడి కూతురు అలయా. కాగా అలయా ‘జవానీ జానేమాన్’ చిత్రంతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేయనున్నారు. ఈ చిత్రంలో స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలయ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘అవును.. అనన్యకు నెపోటిజమ్‌ మీద మంచి అభిప్రాయం లేదు కానీ నాకు ఉంది’ అని చెప్పుకొచ్చారు. అంతేగాక ప్రస్తుత వర్థమాన నటి, నటుల చిత్రాలను చూస్తున్నానని, వారి నటన తీరు, ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటున్నానని చెప్పారు. కాగా కార్తిక్‌ ఆర్యన్‌, సారా అలీ ఖాన్‌లు నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ టైలర్‌ ఇటివలే విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై అలయా మాట్లాడుతూ.. ‘సారా, కార్తీక్‌ల బెడ్‌ సీన్‌ చూశాను. అది చూసిన తర్వాత నాకు కూడా కార్తిక్‌తో అలాంటి సన్నివేశంలో నటించాలనిపించింది’ అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక కార్తిక్‌ను మీ బెడ్‌పై చూస్తే అప్పుడు మీ స్పందన ఎంటి అని అడిగిన ప్రశ్నకు ‘ఒకవేళ నేను లేచేసరికి కార్తిక్‌ నా బెడ్‌పై కనిపించినా ఆశ్చర్యపోను.. ఎందుకంటే అది నేను కోరుకున్న విషయమే.. ఇది ఇంతకు ముందే చెప్పాను’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది ఈ అమ్మడు. అంతేకాదు ‘నేను ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. ఎందుకంటే ఓ బంధంలో ఉండటమంటే నా దృష్టిలో కష్టమే’  అని పేర్కొన్నారు. కాగా రాపిడ్‌ ఫైర్‌ గేమ్‌లో భాగంగా అడిగిన ప్రశ్నలకు.. ‘పెళ్లి వరుణ్‌ దావన్‌ చేసుకుంటాను. డేటింగ్‌ కార్తిక్‌ ఆర్యన్‌తో చేస్తాను. ఇషాన్‌ ఖత్తర్‌ను చంపేస్తాను’ అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. అలాగే ఒకే జెండర్‌తో అయితే ‘సారా అలీఖాన్‌ను పెళ్లి చేసుకుంటా, జాన్వీ కపూర్‌తో డేటింగ్‌ చేస్తా.. అనన్యను చంపేస్తా’ అని  చమత్కరించడం విశేషం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా