ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 ప్రమోషన్ కు అలీ ఫజల్ దూరం

15 Mar, 2015 15:58 IST|Sakshi
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 ప్రమోషన్ కు అలీ ఫజల్ దూరం

న్యూఢిల్లీ: త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోయే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 ప్రమోషన్ నుంచి హాలీవుడ్ నటుడు అలీఫజల్ నిష్క్రమించాడు. దీనికి కారణం లేకపోలేదు. అదేమిటంటే సోనీ రజ్దాన్ దర్శకత్వంలో ఆయన ''లవ్ అఫైర్'' అనే సినిమా చేయబోతున్నాడు. ఈ కారణంతోనే అతడు ప్రమోషన్ కు హాజరుకావటంలేదని అలీఫజల్ సన్నిహితులు తెలిపారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ కు మాత్రం ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7  సినిమా ప్రీమియర్ కు హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని అలీఫజల్ తెలిపారు.

 

ఇదిలాఉండగా ఫాస్ట్ అండ్ ప్యూరియస్ 7 సినిమాలో అలీఫజల్ మూడు సీన్లలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విన్ డీజిల్ కూడా నటించారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 భారత్ లో ఏప్రిల్ 2 వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళ్ లోనూ విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.