ప్చ్‌.. టైమ్‌ బాగాలేదు

29 Apr, 2018 00:57 IST|Sakshi
సోనాక్షి సిన్హా

‘హ్యాపీ ఫిర్‌ భాగ్‌ జాయేగీ’ మూవీ టీమ్‌కి టైమ్‌ బాగాలేనట్లుంది. ఎక్కడ షూటింగ్‌ స్టార్ట్‌ చేసినా ఏదో ఒక కారణంతో బ్రేక్‌ పడుతోంది. సోనాక్షి సిన్హా, డయానా పెంటీ, అభయ్‌ డియోల్, అలీ ఫాజల్‌ ముఖ్యతారలుగా ముదసర్‌ అజీజ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘హ్యాపీ ఫిర్‌ భాగ్‌ జాయేగీ’. రెండేళ్ల కిత్రం అజీజ్‌ దర్శకత్వంలోనే వచ్చిన ‘హ్యాపీ భాగ్‌ జాయేగీ’ సినిమాకు సీక్వెల్‌ ఇది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను థాయ్‌ల్యాండ్‌లో స్టార్ట్‌ చేశారు.

కానీ అక్కడ లొకేషన్స్‌కు పర్మిషన్స్‌ ప్రాబ్లమ్స్‌తో షూటింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. నెక్ట్స్‌ మలేసియాలో కొత్త షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు. కానీ అక్కడి కౌలాలంపూర్‌లో వెదర్‌ బాగాలేక ప్రజెంట్‌ షూటింగ్‌ ఆగిపోయింది. వెదర్‌ కండీషన్స్‌ షూటింగ్‌కు అనుకూలించకపోతే టీమ్‌ ముంబై రావాలని ప్లాన్‌ చేస్తోందట. ఆల్రెడీ సినిమాను ఆగస్టులో రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. అయితే అనుకున్నట్లుగా షూటింగ్‌ సాగకపోవడంతో ‘ప్చ్‌.. టైమ్‌ బాగాలేదు’ అనుకుంటున్నారట చిత్రబృందం.

మరిన్ని వార్తలు