'ఐ ల‌వ్ యూ చెప్పేందుకు 3 నెల‌లు'

1 Jul, 2020 15:19 IST|Sakshi

బాలీవుడ్ ప్రేమ‌జంట‌ అలీ ఫ‌జ‌ల్‌, రిచా చ‌ద్దా ఐదేళ్ల డేటింగ్‌కు ఫుల్‌స్టాప్ పెడుతూ ఏప్రిల్‌లో పెళ్లి నిర్ణ‌యించుకున్నారు. కానీ వీరి పెళ్లికి క‌రోనా శ‌నిలా అడ్డు త‌గిలింది. దీంతో ఏప్రిల్ 15న జ‌ర‌గాల్సిన వివాహాన్ని వాయిదా వేసుకున్న విష‌యం తెలిసిందే. కాగా వీరి మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించింద‌నే విష‌యాన్ని బ్రైబ్స్‌ ఇండియా మ్యాగ‌జైన్‌తో చెప్పుకొచ్చారు‌. ముందుగా రిచా మాట్లాడుతూ.. "అలీ మాల్దీవుల్లోని ఐలాండ్‌లో రొమాంటిక్ డిన్న‌ర్ ప్లాన్ చేశాడు. బ‌హుశా నా పుట్టిన‌రోజు కోసమేమో అనుకున్నా. అంత‌కుమించి ఎక్కువ‌గా ఊహించ‌లేదు. ఇక ఆ రోజు మేము క‌లిసి తింటూ ఉన్నాం. స‌డ‌న్‌గా అలీ ధైర్యం చేసి న‌న్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ‌త‌ర్వాత‌ 10 నిమిషాల గ్యాప్ తీసుకున్నాడు. బ‌హుశా ప్ర‌పోజ్ చేసినందుకు త‌ను లోలోప‌ల భ‌య‌ప‌డుతూ, మ‌థ‌న‌ప‌డిన‌ట్టున్నాడు. అయితే మోకాళ్ల‌పై కూర్చుని, చేతిలో ఉంగ‌రం ప‌ట్టుకుని మాత్రం ప్ర‌పోజ్ చేయ‌లేదు." (అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోలేం: నటి)

"నా విష‌యానికొస్తే నేను తొలిసారిగా నా ప్రేమ‌ను ఎప్పుడు వ్య‌క్తీక‌రించానంటే.. మా ఇంట్లో మేమిద్ద‌రం క‌లిసి నాకెంతో ఇష్ట‌మైన‌ చాప్లిన్ సినిమా చూస్తున్నాం. ఆ సినిమాను అలీ బాగా ఎంజాయ్ చేశాడు. అప్పుడు నా అభిరుచి ఉన్న వ్య‌క్తి దొర‌క‌టం అదృష్టం అనుకున్నా. వెంట‌నే ఐ ల‌వ్ యూ చెప్పా. కానీ నాకు తిరిగి ఐ ల‌వ్ యూ అని చెప్ప‌డానికి అలీకి మూడు నెల‌లు ప‌ట్టింది" అని రిచా బుంబగ‌మూతి పెట్టింది. "రిచా చిన్న‌పిల్ల‌లా ప్ర‌వ‌ర్తిస్తుంది. త‌న‌ను ప్రేమించ‌డానికి అది కూడా ఓ కార‌ణం. ఆమె అన్నం తింటుంటే త‌న చుట్టూ ఆహారాన్ని కింద వెద‌జ‌ల్లిన‌ట్లే ఉంటుంది. గ్లాసులో ఉన్న నీళ్లు స‌గం కింద ప‌డిపోయి క‌నిపిస్తుంది.. ఓ సారి డిన్న‌ర్ చేస్తున్న‌ప్పుడు అయితే ఏకంగా ఆమె ప్లేట్‌లోని వ‌స్తువు గాల్లోకి లేచి ఇత‌రుల ప్లేట్‌లో ప‌డింది" అంటూ అలీ న‌వ్వుతూ సెల‌విచ్చాడు. (ఆ స్టార్‌ ప్రేమజంట పెళ్లి వాయిదా!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు