ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి తప్పుకున్న అలియా భట్‌ ?

19 Mar, 2020 13:01 IST|Sakshi

హైదరాబాద్‌ : మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో దర్శక ధీర రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి షాకింగ్‌ అప్‌డేట్‌ ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తి రేపుతున్న ఈ మూవీ హీరోయిన్లలో ఒకరైన బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ మూవీ కోసం భారీ మొత్తం పారితోషికం అందుకున్న అలియా ఎందుకు సినిమా నుంచి వైదొలిగారనేది ఆసక్తికరంగా మారింది. డేట్లను సర్దుబాటు చేయలేకే గల్లీ బాయ్‌ నటి రాజమౌళి మూవీ నుంచి వైదొలిగనట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, హైదరాబాద్‌, గుజరాత్‌, పుణేల్లో ఈనెల ఆరంభంలో జరిగిన షూటింగ్‌లోనూ అలియా పాల్గొన్నారని తెలిసింది. కరోనా వైరస్‌ ఆందోళనతో షూటింగ్‌ ప్రస్తుతం నిలిచిపోయింది.

చదవండి : సంక్రాంతికి సై

ఇక మే షెడ్యూల్‌ కోసం అలియా భట్‌ మేనేజర్‌తో రాజమౌళి బృందం సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. సడక్‌ 2, బ్రహ్మాస్త్ర, సంజయ్‌ లీలా భన్సాలీ ప్రాజెక్ట్‌ వంటి పలు సినిమాలతో ఆమె ఊపిరిసలపని బిజీలో ఉన్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్‌లో డేట్లు కేటాయించలేని స్ధితిలో ఆమె రాజమౌళి ప్రాజెక్టును వదులుకునేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఈ వార్తలను నిర్మాత ధ్రువీకరించకపోయినా పెద్ద ఎత్తున వదంతులు వ్యాపిస్తున్నాయి. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల విప్లవ కథ ఆధారంగా రూ 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సన్నద్ధమవుతోంది.

చదవండి : ఆర్‌ఆర్‌ఆర్‌తో కేజీఎఫ్‌ 2 ఢీ : యష్‌ వివరణ

మరిన్ని వార్తలు