‘నా పెంపుడు పిల్లి గురించి కూడా చర్చించాలా!?’

2 Jan, 2019 13:03 IST|Sakshi

రిలేషన్‌షిప్‌ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే.. అంతేతప్ప అదేదో ఘనకార్యానికి నిదర్శనం కాదని అంటున్నారు బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌. గత కొంతకాలం‍గా చాక్‌లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో ఈ అమ్మడు రిలేషన్‌లో ఉన్నారంటూ బీ-టౌన్‌లో వార్తలు విన్పిస్తున్న సంగతి తెలిసిందే. తరచుగా డిన్నర్‌ డేట్లు, ఫ్యామిలీ గెట్‌ టుగెదర్‌లతో భట్‌, కపూర్‌ కుటుంబాలు చేస్తున్న హంగామా ఇటువంటి వార్తలను నిజం చేస్తోంది కూడా. అయితే ఇంతవరకు ఈ విషయం గురించి అలియా భట్‌ మాత్రం స్పందించలేదు.

ఈ క్రమంలో తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అలియా భట్‌.... ‘ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉండటం అనేది నా జీవితంలో ఒక ముఖ్యమైన అంశం మాత్రమే. అంతేతప్ప ఇలాంటి వాటి వల్ల నేనేదో సాధించినట్టైతే కాదు. అయితే ఒకరితో అనుబంధంలో ఉండటం మాత్రం ఎంతో అందంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే అందుకు సంబంధించిన విషయాలను ఓ మూలన జాగ్రత్తగా దాచి ఉంచాలనుకుంటున్నాను. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం నాకంతగా ఇష్టం ఉండదు. ఒకవేళ నా జీవితంలో నాకెంతో ప్రియమైన ఓ పెంపుడు పిల్లి ఉంటే దానిని నేను రక్షించుకోవాలి గానీ దాని గురించి కూడా సోషల్‌ మీడియాలో చర్చించాలా’ అంటూ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా... అలియా అంటే ప్రత్యేక అభిమానం కనబరిచే నీతూ కపూర్‌(రణ్‌బీర్‌ కపూర్‌ తల్లి) నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటో ‘రాలియా’ అభిమానులను ఆకట్టుకుంటోంది. రణ్‌బీర్‌ కుటుంబంతో కలిసి అలియా న్యూఇయర్‌ సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఈ ఫొటోకు లక్షల్లో లైకులు వస్తున్నాయి.

Happy 2019 🎈 no resolutions only wishes this year !!! Less pollution traffic!! Hope in future cancer is only a zodiac sign !!! No hatred less poverty loads of love togetherness happiness n most imp. Good health ❤️❤️❤️❤️❤️

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

మరిన్ని వార్తలు