సరిహద్దుల్లో ఆలియా భట్ సందడి

15 Aug, 2016 17:56 IST|Sakshi
సరిహద్దుల్లో ఆలియా భట్ సందడి

వాఘా: స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా బాలీవుడ్ నటి ఆలియా భట్ భారత్ , పాకిస్థాన్ సరిహద్దు అయిన వాఘాలో సందడి చేశారు. తన తల్లితో కలిసి ఆమె వాఘాను సందర్శించారు. అనంతరం సైనికులతో కలిసి వాలీబాల్ ఆడారు. గుర్రపుస్వారీ చేశారు. సైనికులతో సరదాగా గడిపిన ఆలియా.. వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఖాకీ ప్యాంటు, నల్ల రంగు జాకెట్‌తో పాటు సైనిక బ్యాడ్జీలను ధరించింది. సైనికుల శిక్షణను, సాహసకృత్యాలను ఆసక్తిగా తిలకించింది. అనంతరం సైనికులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారితో కలిసి ఆడి, పాడి అలరించింది.

వాఘా సరిహద్దు అనేది భారత్- పాకిస్తాన్ మధ్య లాహోర్ , అమృతసర్ నగరాల మధ్య గల ప్రదేశం. వాగా సరిహద్దులో ప్రతిరోజూ సాయంత్రం జరిగే 'బీటింగ్ ది రిట్రీట్'  పెరేడ్ చాలా ఘనంగా ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడకు వచ్చే ప్రతి వారూ తప్పకుండా చూస్తారు. సూర్యాస్తమయ సమయానికి ఈ కార్యక్రమం ముగుస్తుంది. స్వాతంత్ర దినోత్సవాన పరేడ్ ను కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.