-

హాలీవుడ్‌ ఎంట్రీపై స్పందించిన ఆలియా

13 Apr, 2019 20:54 IST|Sakshi

ఆలియా భట్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి దాదాపు ఏడేళ్లు పూర్తికావోస్తున్నాయి. స్టార్ల కుటుంబం నుంచి వచ్చినప్పటికి పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆలియా. రాజీ, హైవే లాంటి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుని తోటి హీరోయిన్‌లకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో త్వరలోనే టాలీవుడ్‌ ప్రేక్షకులని కూడా పలకరించనున్నారు ఆలియా.

ఈ క్రమంలో కొత్త ఇండస్ట్రీలో నటించడం ఎలా ఉందని ఆలియాను ప్రశ్నించగా.. ‘కొత్త పరిశ్రమకు చెందిన ప్రజలను ఎంటర్‌టేన్‌ చేయ్యడం.. వారి మెప్పు పొందడం కాస్తా కష్టమైన పనే. కానీ నా వరకూ నేను వంద శాతం కష్టపడతాన’ని తెలిపారు. హాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తారా అని ప్రశ్నించగా.. ‘ఏదో ఓ రోజు నేను అక్కడికి వెళ్తానని నా నమ్మకం. కానీ అందుకు మరి కొంత సమయం వేచి ఉండక తప్పదు. దాని కోసం నేను మరింత కష్టపడాలి’ అని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో కంగనా రనౌత్‌.. ఆలియా ఓ సాధరణ నటి అంటూ కామెంట్‌ చేసిన విషయం గురించి ప్రస్తావించగా.. ‘కంగనా చాలా మంచి నటి. ఆమె మాటలకు నేను బాధపడటం లేదు. రాజీ సినిమా చూసిన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలను మర్చిపోయింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకూ నేను ఇలాంటి మాటలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ కంగనా మాటలను మాత్రం కాస్తా సీరియస్‌గా తీసుకుంటున్నాను. ఇక మీదట ఆమెకు నచ్చేలా నటించడానికి ప్రయత్నిస్తాను’ అంటూ కౌంటర్‌ వేశారు. ప్రస్తుతం ఆలియా బాలీవుడ్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్నా ‘కళంక్‌’ చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు.

మరిన్ని వార్తలు