హీరోయిన్‌ అలియా భట్‌కు గాయాలు

20 Mar, 2018 17:49 IST|Sakshi
అలియా భట్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, సినిమా : బాలీవుడ్‌ నటి అలియా భట్‌కు గాయాలయ్యాయి. బ్రహ్మస్త షూటింగ్‌లో ఆమె గాయపడినట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్‌ బల్గేరియాలో షూటింగ్‌ జరుపుకుంటోంది. 

యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరణ సమయంలో అలియాకు గాయాలైనట్లు సమాచారం. కుడి భుజానికి బలమైన గాయం కావటంతో ఆమెను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు తెలిపారంట. దీంతో ఆమె ఇండియాకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. కరణ్‌ జోహర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అయన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్‌ తో చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, నాగిని ఫేమ్‌ మౌనీ రాయ్‌ నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్‌ 2019లో విడుదల కానుంది. ఇది కాకుండా అలియా భట్‌ నటించిన మరో చిత్రం రాజీ విడుదలకు సిద్ధంగా ఉంది.  

మరిన్ని వార్తలు