ఆలియా సో బిజీయా

21 Mar, 2019 04:31 IST|Sakshi
ఆలియా భట్‌

సౌత్‌ అండ్‌ నార్త్‌ ఇండస్ట్రీస్‌లో యంగ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ పేరు మార్మోగిపోతోంది. బీ టౌన్‌లో పెద్ద సినిమా ఏదైనా సరే.. అందులో హీరోయిన్‌పాత్రకు ఆలియా పేరు తప్పక పరిశీలిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ‘రాజీ’ చిత్రంతో నటన పరంగా ఆమె సంపాదించుకున్న డిమాండ్‌ అలాంటిది. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో ఆలియా భట్‌ ఒక కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. రామ్‌చరణ్‌ సరసన నటిస్తారు ఆలియా. ఇప్పుడు సల్మాన్‌ ఖాన్‌కు జోడీగా ఎంపికయ్యారామె.

దాదాపు ఇరవయ్యేళ్ల తర్వాత సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ‘ఇన్‌షా అల్లా’ అనే చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్‌గా ఆలియా భట్‌ను ఎంపిక చేశారు. ఇంతకుముందు ‘హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌’ సినిమా కోసం సల్మాన్‌–భన్సాలీ కలిసి వర్క్‌ చేశారు. ఇవి కాక ‘కళంక్, బ్రహ్మాస్త్ర, తక్త్, సడక్‌ 2’ చిత్రాల్లో కూడా ఆలియా కథానాయిక అన్న విషయం తెలిసిందే. ఇవన్నీ భారీ బడ్జెట్‌ చిత్రాలే కావడం విశేషం. ‘కళంక్‌’ చిత్రం ఏప్రిల్‌ 17న విడుదల కానుంది. మూడుభాగాలుగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం రిలీజ్‌కు రెడీ అయ్యింది. ‘తక్త్, సడక్‌ 2’ చిత్రాలు సెట్స్‌ పైకి వెళ్లాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు