ఆలియా ఆవో!

18 Feb, 2019 03:43 IST|Sakshi

బాలీవుడ్‌ కథానాయికలు టాలీవుడ్‌లో అవకాశాలు దక్కించుకోవడం కొత్తేం కాదు. తాజాగా మరో బ్యూటీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కథానాయికలు ఎవరు? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. చాలామంది హీరోయిన్ల పేర్లు చర్చకు వచ్చాయి.

రామ్‌చరణ్‌ సరసన ఆలియా భట్‌ ఎంపిక అయ్యారని తెలిసింది. ఎన్టీఆర్‌కు జోడీగా కూడా బాలీవుడ్‌ హీరోయిన్‌నే ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. పోలీసాఫీసర్, నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు... ఇలా రామ్‌చరణ్‌ పాత్రలో మూడు షేడ్స్‌ ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అలాగే ఎన్టీఆర్‌ బందిపోటు పాత్రలో కనిపిస్తారని టాక్‌. ఈ సినిమా 1920 నేపథ్యంలో సాగుతుందట. యం.యం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సముద్రఖని, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలు చేస్తు న్నారు.

మరిన్ని వార్తలు