ఆ విషయాన్ని అంగీకరించను: అలియా భట్‌

11 May, 2018 20:33 IST|Sakshi
రణ్‌బీర్‌ కపూర్‌- అలియా భట్‌ (ఫైల్‌ ఫొటో)

అలియా భట్‌..  అందంతో పాటు అభినయంతో కూడా మెప్పించగల నటి. ఆమె నటించిన రాజీ సినిమా ఈరోజు(శుక్రవారం) విడుదలైంది. అయితే ఆ సినిమా గురించి మాట్లాడే వారి కన్నా అలియా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడేవారి సంఖ్య ఎక్కువైంది. ఇంతకీ విషయమేమిటంటే.. ‘బ్రహ్మాస్త్ర’  సినిమాలో నటించినప్పటి నుంచి అలియా, రణ్‌బీర్‌ కపూర్‌ల మధ్య ప్రేమ చిగురించిందని వదంతులు ప్రచారం అవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల ఎక్కడ చూసినా అలియా- రణ్‌బీర్‌లు జంటగా కనపడుతున్నారు. తాజాగా సోనమ్‌ కపూర్‌ పెళ్లి​కి వచ్చిన వీరివురు ఫొటోలకు పోజులిచ్చి అభిమానులకు కనువిందు చేశారు.

అయితే రజత్‌ శర్మ షో ‘ఆప్‌ కీ అదాలత్‌’కి గెస్ట్‌గా వచ్చిన అలియా రూమర్లపై స్పందించారు. ‘ఒకవేళ ఏదైనా జరుగుతుందని మీకనిపిస్తే అలాగే అనుకోండి.. కానీ ఆ విషయాన్ని నేను అంగీకరించాలనుకోవడం లేదంటూ’  అలియా వ్యాఖ్యానించారు. అయితే వెంటనే మళ్లీ.. ‘అతడి(రణ్‌బీర్‌ కపూర్‌) గురించి అడిగినపుడు నా ముఖం వికసిస్తోంది. నేను దానిని ఎలా నియంత్రించాలా అని ఆలోచిస్తున్నానంటూ’  అభిమానులను కన్ఫూజన్‌కు గురి చేశారు.

నేనేం ఫీలవ్వను..
అలియాకు జనరల్‌ నాలెడ్జ్‌ లేదంటూ సోషల్‌ మీడియాలో జోకులు పేలడంపై ఆమె స్పందించారు. కరణ్‌ షోలో పాల్గొన్నప్పుడు.. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయానని పేర్కొన్నారు. కాబట్టి తనకేమీ తెలియదంటూ జనాలు నవ్వుకుంటున్నారని.. అయితే అటువంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోనంటూ అలియా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు