అరె అచ్చం అలాగే ఉన్నారే!!

19 Sep, 2019 09:50 IST|Sakshi

మోడల్‌, సోషల్‌ మీడియా ఫేమ్‌ ఆకాంక్ష రంజన్‌కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. తన ప్రాణ స్నేహితురాలు ఆకాంక్షతో బాల్యంలో దిగిన ఫొటోను షేర్‌ చేసిన అలియా..‘ నా సర్వస్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు ముద్దగుమ్మల ఫొటో.. నెటిజన్లతో పాటు సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. ఆకాంక్షకు విషెస్‌ చెప్పిన నటి జరీన్‌ ఖాన్‌...‘ చాలా అందంగా ఉన్నారు. చిన్నపుడు ఎలా ఉన్నారో..ఇప్పుడు కూడా అచ్చం అలాగే ఉన్నారు. ఏమాత్రం మారలేదు. సో క్యూట్‌’అంటూ కామెంట్‌ చేశారు.

ఇక మంగళవారం రాత్రి నుంచే పుట్టినరోజు వేడుకలు ప్రారంభించిన ఆకాంక్ష..తన సెలబ్రిటీ స్నేహితులందరినీ పార్టీకి ఆహ్వానించింది. ఈ పార్టీకి హాజరైన ప్రేమపక్షులు అలియా భట్‌-రణ్‌బీర్ కపూర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వాణీ కపూర్‌, అతియా శెట్టి, ఆదిత్య సీల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సహా ఇతర సెలబ్రిటీలు కూడా పార్టీలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

happy birthday my everything 💓

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా